చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మైనంపల్లి హన్మంతరావు

  • చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్న మైనంపల్లి
  • ఐటీ రంగంలో ఆయన వల్ల అనేకమందికి ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్య
  • అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందన్న తెలంగాణ ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉందని, ఐటీ రంగంలో ఆయన వల్ల అనేకమందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలా కనిపిస్తోందన్నారు.

   అరెస్టును ఖండించిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

చంద్రబాబు అరెస్టును సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా ఖండించింది. అనుమానాల ప్రాతిపదికన అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదని పేర్కొంది. ఆధారాలు చూపకుండా ఆరోపణలపై అరెస్ట్ బాధాకరమని, అంతేకాకుండా ప్రతిపక్ష నేత అరెస్ట్‌లో పారదర్శకత కనిపించలేదని పేర్కొంది. రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబు భద్రతపై అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తదితరులు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలో ఉన్నారు.


More Telugu News