ఆసియా కప్: టీమిండియా టార్గెట్ 266 రన్స్
- నేటితో ముగియనున్న ఆసియా కప్ సూపర్-4 దశ
- చివరి లీగ్ మ్యాచ్ లో తలపడుతున్న భారత్, బంగ్లాదేశ్
- టాస్ గెలిచి బంగ్లాదేశ్ కు బ్యాటింగ్ అప్పగించిన భారత్
- 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసిన బంగ్లాదేశ్
ఆసియా కప్ సూపర్-4 దశలో నేడు చివరి లీగ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా... బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్ లో కెప్టెన్ షకీబల్ హసన్ 80, తౌహిద్ హృదయ్ 54, నసుమ్ అహ్మద్ 44, మెహెదీ హసన్ 29 (నాటౌట్) రాణించారు.
ఓ దశలో బంగ్లా జట్టు 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ షకీబల్ హసన్, తౌహిద్ హృదయ్ జంట విలువైన భాగస్వామ్యంతో ఆదుకుంది. టెయిలెండర్లు కూడా పోరాడడంతో బంగ్లా స్కోరు 250 మార్కు దాటింది.
టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహ్మద్ షమీ 2, ప్రసిద్ధ్ కృష్ణ 1, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 1 వికెట్ల తీశారు. భారత్ ఇప్పటికే టోర్నీలో ఫైనల్ చేరుకున్న నేపథ్యంలో, ఈ ఛేజింగ్ ద్వారా బ్యాటింగ్ ను మెరుగుపర్చుకునే అవకాశం లభించింది.