కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వరరావు.. డేట్ ఫిక్స్!

  • తుమ్మల నివాసానికి వెళ్లిన ఠాక్రే, రేవంత్, భట్టి, పొంగులేటి
  • ఈ నెల 17న హైదరాబాద్ లో కాంగ్రెస్ సభ
  • ఆ సభలో సోనియా సమక్షంలో పార్టీలో చేరాలని కోరిన నేతలు
తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమయింది. ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగసభలో ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమావేశం. ఈరోజు తుమ్మల నివాసానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు వెళ్లారు. పార్టీలో చేరాలని ఆయనను అందరూ కలిసి ఆహ్వానించారు. వారి ఆహ్వానం పట్ల తుమ్మల కాస్త సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.


More Telugu News