వచ్చే నెలలో కీలక మార్పు.. అతిముఖ్యమైన డాక్యుమెంట్‌గా బర్త్ సర్టిఫికేట్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్-2023 చట్టం
- ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన హోం మంత్రిత్వ శాఖ
- కొత్త చట్టం ఆధారంగా జాతీయస్థాయిలో జనన మరణాల ఏకీకృత డేటాబేస్ ఏర్పాటు
- అన్ని రకాల అధికారిక డాక్యుమెంట్ల జారీకి కీలకంగా మారనున్న జనన ధ్రువీకరణ పత్రం
అక్టోబర్ 1 నుంచి దేశప్రజలకు బర్త్ సర్టిఫికేట్ అతి ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారనుంది. కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, వోటర్ల లిస్టులో పేరు నమోదు, ఆధార్ కేటాయింపు, వివాహ రిజిస్ట్రేషన్లు వంటి వాటికి అవసరమైన ఒకే ఒక కీలక డాక్యుమెంట్‌గా మారనుంది. ఈ దిశగా పార్లమెంట్ రూపొందించిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్‌మెంట్) చట్టం-2023 వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం భవిష్యత్తులో పేర్కొనే ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని కూడా హోం మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ చట్టంతో దేశవ్యాప్తంగా జననమరణాలకు సంబంధించి ఏకీకృత డేటాబేస్ సిద్ధమవుతుందని కేంద్రం పేర్కొంది. ఫలితంగా, మరింత సమర్థవంతంగా ప్రజాసేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.
గత నెలలో ముగిసిన సమావేశాల్లో పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఆగస్టు 1న లోక్‌సభ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయగా ఆగస్టు 7న రాజ్యసభ మూజువాణి వోటుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1969 చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది.
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో జననమరణాల డాటాబేస్ రూపొందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పించింది. అంతేకాకుండా, రాష్ట్రాల్లోని చీఫ్ రిజిస్ట్రార్లు, స్థానిక సంస్థల్లోని రిజిస్ట్రార్లు తమ పరిధిలోని జననమరణాల వివరాలను జాతీయ డాటాబేస్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా, శిశువుల జననాల రిజిస్ట్రేషన్ సమయంలో తల్లిదండ్రులు ఆధార్ వివరాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.