వీటిని హిందీలో ఏమనాలో చెప్పండి: సచిన్ టెండూల్కర్

  • అంపైర్, వికెట్ కీపర్, ఫీల్డర్, హెల్మెట్ కు హిందీ పేర్లు చెప్పాలన్న క్రికెట్ దిగ్గజం
  • నిన్న హిందీ దినోత్సవం సందర్భంగా ట్వీట్ 
  • సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సచిన్
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే ప్రముఖుల్లో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఒకరు. ఆటతో పాటు అనేక విషయాలపై తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటారు. నిన్న హిందీ దినోత్సవం సందర్భంగా టెండూల్కర్ ఫాలోవర్లను క్రికెట్ పరిభాష గురించి ఆసక్తికర ప్రశ్న అడిగారు. క్రికెట్ లోని అంపైర్, వికెట్ కీపర్, ఫీల్డర్, హెల్మెట్ ను హిందీలో ఏమనాలో చెప్పాలని ఎక్స్ (ట్విట్టర్)లో కోరారు. 

దీనికి అభిమానుల నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. అంపైర్ ను మధ్యస్థ, వికెట్ కీపర్ ను యష్టి రక్షక్, ఫీల్డర్ ను క్షేత్ర రక్షకుడు, హెల్మెట్ ను శిరస్త్రాణ అనాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. విపంచ్, ఫటకీ కా రఖవాలా, క్షేత్రరక్షక అనాలంటూ మరొకరు ట్వీట్ చేశారు.


More Telugu News