ఎల్టీటీఈ ప్రభాకరన్ కుమార్తె బతికే ఉన్నారా?

  • 2009లోనే ప్రభాకరన్ సహా ఆయన కుటుంబాన్ని హతమార్చిన శ్రీలంక సైన్యం
  • ద్వారక తన పేరును ఉదయకళగా మార్చుకుని కొన్నాళ్లు తమిళనాడులో ఉన్నారంటూ వార్తలు
  • ప్రస్తుతం శ్రీలంకలోనే ప్రజాసేవలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు
  • ప్రభాకరన్ భార్య సోదరినంటూ డెన్మార్క్ నుంచి మరో వీడియో
శ్రీలంకలో ప్రత్యేక తమిళదేశం కోసం పోరాడిన ఎల్టీటీఈ అధ్యక్షుడు, పెద్దపులిగా పేరుగాంచిన వేలుపిళ్లై ప్రభాకరన్ కుమార్తె బతికే ఉన్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ప్రభాకర్ కుమార్తె ద్వారక.. తన పేరుని ఉదయకళగా మార్చుకుని కొన్నాళ్లపాటు తమిళనాడులో ఆశ్రయం పొందారని, ప్రస్తుతం శ్రీలంకలోనే ప్రజాసేవలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. 

ఈ వార్తలను నిజం చేసేలా.. డెన్మార్క్‌లో ఉంటున్న తారకా హరిధరన్ అనే మహిళ తాను ప్రభాకరన్ భార్య మదివదని సోదరినని చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. ప్రభాకరన్ కుమార్తె ద్వారక బతికే ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

కాగా, ప్రభాకరన్‌‌ను శ్రీలంక సైన్యం 2009లో హతమార్చింది. సైన్యం చేతిలో ఆయన భార్య మదివదని, ఇద్దరు కుమారులు, కుమార్తె ద్వారక కూడా మృతి చెందినట్టు అప్పట్లో సైన్యం ప్రకటించింది. ఇప్పుడు ద్వారక బతికే ఉన్నారన్న వార్తలు సంచలనమవుతున్నాయి.


More Telugu News