రూ.2000 నోట్లను తీసుకోరాదని అమెజాన్ నిర్ణయం
- రూ.2000 నోట్లను రద్దు చేసిన కేంద్రం
- నోట్లను మార్చుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30
- గడువు ముగుస్తున్న నేపథ్యంలో అమెజాన్ ప్రకటన
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీల సమయంలో రూ.2000 నోట్లను తీసుకోరాదని నిర్ణయించింది. కేంద్రం రూ.2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పెద్ద నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30 వరకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. ఈ గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో, అమెజాన్ తాజా ప్రకటన చేసింది.
మే నెల నుంచి రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించగా, ఇప్పటివరకు రూ.3.32 లక్షల కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.
మే నెల నుంచి రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించగా, ఇప్పటివరకు రూ.3.32 లక్షల కోట్ల విలువ చేసే రూ.2000 నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయినట్టు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.