హైదరాబాద్ పోలీసుల విమర్శలపై స్పందించిన 'బేబీ' చిత్ర దర్శకుడు
- ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న 'బేబీ'
- 'బేబీ' చిత్రం డ్రగ్స్ సంస్కృతి పెంచే విధంగా ఉందన్న సీపీ
- పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారన్న దర్శకుడు సాయిరాజేష్
- ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని కోరారని వెల్లడి
ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన 'బేబీ' చిత్రం హైదరాబాద్ పోలీసుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. 'బేబీ' చిత్రం డ్రగ్స్ సంస్కృతిని పెంపొందించే విధంగా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. తాము ఇటీవల ఓ అపార్ట్ మెంట్ పై దాడులు చేసినప్పుడు, అక్కడ 'బేబీ' చిత్రం తరహా దృశ్యాలు కనిపించాయని తెలిపారు. 'బేబీ' చిత్రబృందానికి నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 'బేబీ' చిత్ర దర్శకుడు సాయిరాజేష్ స్పందించారు. బేబీ సినిమాపై పోలీసులు అడ్వైజరీ నోటీస్ ఇచ్చారని చెప్పారు. 'బేబీ' సినిమాలో ఒక సన్నివేశం గురించి పోలీసులు ఆరా తీశారని, డ్రగ్స్ సన్నివేశాలపై వివరణ అడిగారని వెల్లడించారు. కథలో భాగంగానే ఆ సన్నివేశాలను సినిమాలో పెట్టాల్సి వచ్చిందని దర్శకుడు సాయిరాజేష్ వివరించారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని పోలీసులు కోరారని తెలిపారు.