హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ను సొంతం చేసుకున్న నాగచైతన్య
- త్వరలోనే భారత్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు
- ఫార్ములా-4 పోటీలకు ఆతిథ్యమివ్వనున్న భారతీయ నగరాలు
- మోటార్ స్పోర్ట్ లో పాలుపంచుకుంటున్న నాగచైతన్య
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య మోటార్ స్పోర్ట్ ఫ్రాంచైజీకి సొంతదారుగా మారాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ కు యజమాని అయ్యాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ భారత్ లో జరిగే ఫార్ములా-4 పోటీల్లో పాల్గొననుంది.
భారత్ లో ఫార్ములా-4 పోటీలు జరగడం ఇదే ప్రథమం. దీనిపై నాగచైతన్య స్పందించారు. మోటార్ స్పోర్ట్ లో ఏదో ఒక విధంగా పాలుపంచుకోవాలన్న కోరిక ఈ విధంగా తీరిందని తెలిపారు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ లో భాగం కావడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు. భారత మోటార్ స్పోర్ట్ చరిత్రలో ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకుంటుందన్న నమ్మకం తనకుందని వివరించారు.
ఈ క్రీడను ఇష్టపడేవారికి ఎంతో వినోదం లభిస్తుందని, యువ ప్రతిభావంతులైన రేసర్లకు ఇది తగిన వేదికగా నిలుస్తుందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. ఫార్ములా-4 ఇండియన్ చాంపియన్ షిప్ లో స్ట్రీట్ రేసుల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.