పవన్ కల్యాణ్ మద్దతివ్వడం సంతోషంగా ఉంది: బీటెక్ రవి
- పులివెందులలో టీడీపీ దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ
- చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్న బీటెక్ రవి
- కిషన్ రెడ్డి సహా జాతీయ నాయకుల మద్దతు లభిస్తోందని వెల్లడి
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ తీరును కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు జాతీయ నాయకులు తప్పుబట్టారని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకుల నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో చంద్రబాబుకు మద్దతు లభిస్తోందన్నారు. తమకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతివ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా పులివెందులలో టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు తోడుగా మేం సైతం అంటూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
పవన్ కల్యాణ్ చారిత్రక నిర్ణయం
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాలను సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ... పొత్తు విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడన్నారు. సైకో జగన్‌ను, సైకో జగన్ ప్రభుత్వాన్ని జనసేన, టీడీపీ సమష్టిగా ఎదుర్కొంటాయన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.