డ్రగ్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ బేబీ సినిమాపై సీవీ ఆనంద్ ఆగ్రహం
- ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్‌లో రైడ్ నిర్వహించినప్పుడు బేబీ దృశ్యాలు కనిపించాయని వెల్లడి
- సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టేటప్పుడు కింద వేసే హెచ్చరిక ప్రకటన కూడా లేదన్న సీవీ ఆనంద్
- తాము హెచ్చరికలు జారీ చేశాక వార్నింగ్ నోట్ పెట్టారని వెల్లడి
బేబీ సినిమాపై హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా డ్రగ్స్ కల్చర్‌ను ప్రోత్సహించేలా ఉందని మండిపడ్డారు. సినిమాలో డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయని, ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్‌లో రైడ్ నిర్వహించినప్పుడు బేబీ సినిమాలోని దృశ్యాలు కనిపించాయన్నారు. ఆ సినిమాను చూశాకే నిందితులు అలా పార్టీ చేసుకున్నారన్నారు.
సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు కింద వేసే హెచ్చరిక ప్రకటన కూడా వేయలేదన్నారు. ఆ తర్వాత తాము హెచ్చరిక జారీ చేస్తే హెచ్చరిక నోట్ వేశారన్నారు. ఈ సినిమా బృందానికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇక ప్రతి సినిమాపై నిఘా వేస్తామన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదన్నారు.
నార్కోటిక్ విభాగం పోలీసులు మాదాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడారు. ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లతో పాటు డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.