కొలంబోలో ఎట్టకేలకు ప్రారంభమైన పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్

  • ఆసియా కప్ లో నేడు పాకిస్థాన్, శ్రీలంక అమీతుమీ
  • గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్తు
  • శాంతించిన వరుణుడు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
ఆసియా కప్ పై వరుణుడు పగబట్టాడా? అనే రీతిలో మ్యాచ్ లకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. ఇవాళ పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా వరుణుడు ఆందోళనకు గురిచేశాడు. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే పాకిస్థాన్ ఇంటిముఖం పడుతుంది... శ్రీలంక ఫైనల్ చేరుతుంది. ఈ నేపథ్యంలో, పాక్ అభిమానులు ఎలాగైనా ఈ మ్యాచ్ జరగాలని కోరుకున్నారు. 

కాగా, శ్రీలంక రాజధాని కొలంబోలో వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఓవర్లను 45కి తగ్గించారు. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్ లో ఉన్న పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ ను లంక బౌలర్ ప్రమోద మదుషాన్ ఐదో ఓవర్లో అవుట్ చేశాడు. జమాన్ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు.

 8 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 1 వికెట్ నష్టానికి 35 పరుగులు కాగా... ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (12 బ్యాటింగ్), కెప్టెన్ బాబర్ అజామ్ (18 బ్యాటింగ్) ఆడుతున్నారు.


More Telugu News