వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... 'ఛానల్స్' పేరుతో బ్రాడ్‌కాస్ట్ సదుపాయం

  • ఈ 'ఛానల్స్' ద్వారా అందుబాటులోకి సెర్చ్ ఫీచర్
  • ఇష్టమైన వ్యక్తులు, సంస్థలను ఫాలో కావొచ్చు
  • వారి నుండి అప్ డేట్స్ పొందే వెసులుబాటు
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో సందేశాలు పంపించే అవకాశం
వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. బ్రాడ్ కాస్ట్ తరహాలో వాట్సాప్ ఛానల్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా కొత్త సదుపాయాన్ని విడుదల చేసింది. ఈ ఛానల్స్‌లో డైరెక్టరీ సెర్చ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో, వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ అయిన ఈ ఛానల్స్‌ ఫీచర్ ద్వారా మనకు ఇష్టమైన సెలబ్రిటీలను ఫాలో కావడంతో పాటు వారు అందించే అప్ డేట్స్‌ను పొందవచ్చు. సెలబ్రిటీలు పెట్టే మెసేజ్‌లకు స్పందించే వెసులుబాటు కూడా కల్పించింది. అలాగే, ఒకేసారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపించవచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ భారత్‌తో సహా 150 దేశాల్లో అందుబాటులోకి రానుంది.

వినియోగదారులు తమ దేశం ఆధారంగా ఫిల్టర్ చేయబడిన మెరుగైన డైరెక్టరీని యాక్సెస్ చేయవచ్చు. త్వరలో వినియోగదారులందరికీ ఇది అందుబాటులోకి రానుంది. సరికొత్త ఫీచర్, కొత్త అప్ డేట్స్ గురించి మరింత తెలుసుకోవడానికి వినియోగదారులు అధికారిక వాట్సాప్ ఛానల్స్‌లో చేరవచ్చునని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.


More Telugu News