చంద్రబాబు అరెస్ట్ పై కేఏ పాల్ ఏమన్నారంటే...!
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబు అరెస్ట్ సరైనదేనన్న కేఏ పాల్
- అవినీతికి పాల్పడ్డాడు కాబట్టే అరెస్ట్ చేశారని వెల్లడి
- కియా తప్ప చంద్రబాబు ఇంకేం తెచ్చారంటూ వ్యాఖ్యలు
- చంద్రబాబు అరెస్ట్ పై ప్రజల్లో స్పందన లేదన్న పాల్
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం పట్ల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు... అందుకే అరెస్ట్ అయ్యాడు... ఆయన అరెస్ట్ సరైనదే అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబును అంబేద్కర్, గాంధీతో పోల్చుతున్నారు.... లోకేశ్ భగత్ సింగ్ అంట... ఇంతకంటే దారుణమైన పోలిక ఇంకేదైనా ఉంటుందా? అని విమర్శించారు. చంద్రబాబు కియా తప్ప ఇంకేం తెచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ విషయాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడంలేదని కేఏ పాల్ పేర్కొన్నారు.
జగన్ దోపిడీకి పాల్పడ్డాడని చంద్రబాబు అంటారు... చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డాడని జగన్ అంటారు... ఏమిటిది... ఇదేమైనా మ్యాచ్ ఫిక్సింగా? అంటూ కేఏ పాల్ ధ్వజమెత్తారు. దోచుకునేవాళ్లు దేశనాయకులా? అని నిలదీశారు. మోదీ, అమిత్ షా, అదానీల తొత్తులు అంటూ విమర్శించారు.