జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారుల వీరమరణం
- అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం
- మృత్యువాతపడినవారిలో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ
- భారీ కాల్పుల మధ్యే పోలీస్ అధికారి మృతదేహం లభ్యం
జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు అధికారులు అసువులు బాశారు. ఈ ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోన్‌చక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ హుమాయున్ భట్‌లు వీరమరణం పొందారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.
అనంత్‌నాగ్‌లోని కోకెర్‌నాగ్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో భారీ కాల్పుల మధ్యే పోలీస్ అధికారి మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. మన్ ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్. రాష్ట్రీయ రైఫిల్స్ అనేది జమ్మూ కశ్మీర్‌లో పని చేస్తోన్న తిరుగుబాటు నిరోధక దళం.