ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం
- ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ఒకరోజు ముందు సీఎం జగన్ అధ్యక్షతన క్యాబినెట్ బేటీ
- పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్న క్యాబినెట్
సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 20న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సెప్టెంబరు 21 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న నేపథ్యంలో, ఒకరోజు ముందు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరుగుతాయని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, మరో రెండు రోజులు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.