రవితేజ ఆ కాసేపు టెన్షన్ పెట్టేశారు: 'ఛాంగురే బంగారు రాజా' డైరెక్టర్
- కామెడీ ప్రధానంగా 'ఛాంగురే బంగారు రాజా'
- దర్శకుడిగా సతీశ్ వర్మ పరిచయం
- రవితేజ సొంత బ్యానర్లో నిర్మితమైన సినిమా
- ఈ నెల 15వ తేదీన సినిమా విడుదల
హీరోగానే కాదు .. నిర్మాతగాను రవితేజ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. 'ఛాంగురే బంగారు రాజా' సినిమాకి ఆయనే నిర్మాత. కార్తీక్ రత్నం హీరోగా నటించిన ఈ సినిమాకి, సతీశ్ వర్మ దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా నడిచే ఈ సినిమాను, ఈ నెల 15వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సతీశ్ వర్మ మాట్లాడుతూ .. "పదేళ్లుగా నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ వచ్చాను. 'నారప్ప' సినిమాకి నేను పనిచేస్తున్నప్పుడే నాకు కార్తీక్ రత్నంతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ఆయనకి ఈ కథను చెప్పాను" అన్నారు.
"నేను రవితేజ గారిని కలిసి రెండున్నర గంటల సేపు కథ చెప్పాను. అంతా విన్న తరువాత ఆయన కాస్త గ్యాప్ తీసుకున్నారు. దాంతో ఆయనకీ నచ్చలేదనుకుని చాలా టెన్షన్ పడిపోయాను. అప్పుడు ఆయన నవ్వుతూ .. 'ఈ సినిమాను చేస్తున్నాం' అన్నారు. అప్పుడు గానీ మనసు తేలికపడలేదు" అని చెప్పుకొచ్చాడు.