శ్రీలంక స్పిన్నర్ వెల్లాలగేకు కేఎల్ రాహుల్ ఓపెన్ చాలెంజ్

  • తదుపరి మ్యాచ్ లో సమర్థంగా ఎదుర్కొంటామన్న విశ్వాసం
  • ఓ లయలో కుదురుకోనీయబోమంటూ సవాల్
  • తాను చూసిన ప్రమాదకర బౌలర్లలో ఒకడని పేర్కొన్న రాహుల్
టీమిండియా టాపార్డర్ ను కుప్పకూల్చిన దునిత్ వెల్లాలగే గురించి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చే కొనసాగుతోంది. దీనిపై టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కాస్త తీవ్రంగా స్పందించాడు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగేకు వ్యతిరేకంగా తాము తదుపరి మ్యాచ్ లో భిన్నమైన దృక్పథంతో ముందుకు వస్తామని ప్రకటించాడు. శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కు ఈ సందర్భంగా రాహుల్ బహిరంగ సవాల్ విసిరాడు. సూపర్ 4 మ్యాచ్ లో మాదిరిగా మరో విడత అతడ్ని ఓ లయలో కుదురుకోనీయబోమన్నాడు. 

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం నాటి మ్యాచ్ లో దులిత్ వెల్లాలగే అద్భుతమైన ప్రదర్శన ప్రతి క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ను ఇంటికి పంపించడమే కాదు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా ఇలా కీలకమైన ఐదు వికెట్లను వెల్లాలగే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ్యాటింగ్ లోనూ అతడు చివరి వరకు శ్రీలంక కోసం పోరాడాడు. 10 వికెట్లు పోయినా, నాటౌట్ గా అతడు తిరుముఖం పట్టాడు. 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

‘‘ఐదు వికెట్లు తీసి అతడు తన జట్టు కోసం పనిచేశాడు. శ్రీలంక తరఫున ఇప్పటి వరకు నేను చూసిన వారిలో ఎంతో ప్రమాదకరమైన బౌలర్ అతడు. టాపార్డర్ లో ఐదు వికెట్లు తీశాడు. ఈ రోజు అతడికి కలిసొచ్చింది. బ్యాటింగ్ తోనూ రాణించాడు’’ అని రాహుల్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. సూపర్4లో పాకిస్థాన్ ను శ్రీలంక ఓడిస్తే.. మరో విడత భారత్-శ్రీలంక తలపడతాయి. అదే జరిగితే వెల్లాలగేని భారత క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


More Telugu News