కృతి శెట్టి ఇప్పుడు చేయవలసింది ఇదే!
- 'ఉప్పెన'తో దూసుకొచ్చిన కృతి శెట్టి
- హ్యాట్రిక్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బ్యూటీ
- ఆ తరువాత నుంచి కలిసిరాని కాలం
- టాలీవుడ్ పై ఆమె దృష్టి పెట్టాలంటున్న ఫ్యాన్స్
వెండితెరపై బంగారు ఛాయతో మెరిసిపోయే భామలకు అదృష్టం చాలా అవసరం. అది లేకపోతే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ సక్సెస్ లు అందుకోవడం కష్టం .. అవకాశాలను రాబట్టుకోవడం కష్టం .. ఒక్క మాటలో చెప్పాలంటే నిలదొక్కుకోవడం కష్టం. వరుస సక్సెస్ లను ఇచ్చినవారిని కూడా వెనక్కి నెట్టగలగడమే ఇక్కడ జరిగే విచిత్రం.
అలాంటి ఒక చిత్రమైన పరిస్థితిని కృతి శెట్టి ఎదుర్కుంటోంది. 'ఉప్పెన సినిమాతో 100 కోట్ల హీరోయిన్ అనిపించుకున్న ఈ బ్యూటీ, 'శ్యామ్ సింగరాయ్' .. 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుంది. దాంతో గోల్డెన్ లెగ్ అంటూ అందరూ ఈ సుందరి గురించే మాట్లాడుకున్నారు. అయితే ఎంత ఫాస్టుగా కృతి దూసుకెళ్లిందో .. అంతే ఫాస్టుగా వెనకబడటం విచారించదగిన విషయమే.
కృతి శెట్టి కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న హీరోలతోనే జోడీ కట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల ఒక్కసారిగా పుంజుకుంది. దాంతో సహజంగానే కృతి శెట్టి వెనకబడింది. అయితే సమయాన్ని వృథా చేయకుండా తమిళ .. మలయాళ సినిమాలపై దృష్టిపెట్టింది. గ్లామర్ పరంగా .. డాన్స్ పరంగా కృతికి వంకబెట్టవలసిన పనిలేదు. ఒక్క హిట్ పడితే ఆమె జోరు మళ్లీ కొనసాగే ఛాన్స్ ఉంది. ఆమె చేయవలసిందల్లా టాలీవుడ్ కి దూరం కాకుండా చూసుకోవడమే.