చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ స్పందన

  • చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న బండి సంజయ్
  • ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్య
  • అరెస్ట్ తర్వాత ఏపీ ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగిందన్న బండి సంజయ్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిన విధానం సరికాదని ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టానికి అందరూ సమానమేనని, కానీ అరెస్ట్ తీరు మాత్రం సరికాదన్నారు.


More Telugu News