టీమిండియా ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చిన వాన
- ఆసియా కప్ లో టీమిండియాను వెంటాడుతున్న వర్షం
- నేడు శ్రీలంకతో టీమిండియా పోరు
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- 47 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగుల స్కోరు... వర్షంతో నిలిచిన మ్యాచ్
ఆసియా కప్ లో టీమిండియా మ్యాచ్ లపై వరుణుడు ప్రభావం చూపడం పరిపాటిగా మారింది. పాకిస్థాన్ తో రెండు మ్యాచ్ ల్లోనూ ప్రత్యక్షమైన వాన... ఇవాళ శ్రీలంకతో మ్యాచ్ లోనూ నేనున్నానంటూ వచ్చేసింది. అయితే, భారత ఇన్నింగ్స్ చివర్లో 47వ ఓవర్ వద్ద వర్షం రావడం కొద్దిగా ఊరట కలిగించే విషయం.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 47 ఓవర్లలో 9 వికెట్లకు 197 పరుగులు చేసింది. నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడి అలసిపోయిన భారత జట్టును శ్రీలంక స్పిన్నర్లు దునిత్ వెల్లాలగే, చరిత్ అసలంక దెబ్బకొట్టారు. వెల్లాలగే 5 వికెట్లు తీయగా, అసలంక 4 వికెట్లు సాధించాడు.
టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 53 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్ 33 పరుగులు చేశారు. గిల్ 19, కోహ్లీ 3, హార్దిక్ పాండ్యా 5, జడేజా 4 పరుగులకే అవుటయ్యారు.