సీఎం జగన్‌ను కలిసిన అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్
- చంద్రబాబు అరెస్ట్, తదనంతర పరిణామాలపై చర్చ
- పిటిషన్లపై ప్రభుత్వపరంగా వాదించాల్సిన అంశాలపై చర్చ
- ఇరువురి మధ్య చర్చకు వచ్చిన అమరావతి రింగ్ రోడ్డు కేసు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ కలిశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్, తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టులో విచారణ, హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై చర్చించారని సమాచారం.
పిటిషన్లపై ప్రభుత్వపరంగా కోర్టుల్లో వాదించాల్సిన అంశాలను అడ్వొకేట్ జనరల్ దృష్టికి సీఎం తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబు అరెస్టయిన స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు, అమరావతి రింగ్ రోడ్డు కేసుల్లో ప్రభుత్వపరంగా వాదించాల్సిన అంశాలపై ఇరువురు చర్చించారని వార్తలు వస్తున్నాయి.