ఓటీటీలో వరల్డ్ వైడ్ గా జోరుచూపుతున్న 'జైలర్'

  • ఆగస్టు 10న థియేటర్స్ కి వచ్చిన 'జైలర్'
  • తొలిరోజునే రికార్డుస్థాయి వసూళ్లు 
  • అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన సినిమా 
  • 36 దేశాలలో ట్రెండింగులో నిలిచిందంటూ సందడి

రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఆగస్టు 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.

రమ్యకృష్ణ .. తమన్నా .. సునీల్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, కథాకథనాల పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కి ఒక రేంజ్ లో మార్కులు పడ్డాయి. యోగిబాబు కామెడీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను రిలీజ్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన ఆదరణ లభించిందని అంటున్నారు. 36 దేశాలలో ఈ సినిమా ట్రెండింగులో నిలిచిందని చెబుతున్నారు. థియేటర్స్ లో మాత్రమే కాకుండా, ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషంగానే చెప్పుకోవాలి.


More Telugu News