ఎంపీ రఘురామకృష్ణరాజుకు లేఖ రాసిన ఎన్నికల సంఘం

  • ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని గతంలో ఈసీకి లేఖ రాసిన రఘురామ
  • రఘురామ లేఖకు గణాంకాలతో వివరణ ఇచ్చిన ఈసీ
  • దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడి
ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఒకే ఇంటి నెంబరుపై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు జూన్ లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అర్హులైన వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం రఘురామ ఆరోపణలకు బదులిస్తూ ఆయనకు లేఖ రాసింది. 

దొంగ ఓట్ల ఏరివేతకు చర్యలు చేపట్టినట్టు ఈసీ వెల్లడించింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది. జీరో ఇంటి నెంబరుతో 2,51,767 ఓట్లు ఉన్నట్టు వివరించింది. 

ఒకే డోర్ నెంబరుతో పది అంతకు మించి ఓట్లు కలిగి ఉన్న ఇళ్లు 1,57,939 అని ఈసీ ఏర్కొంది. ఒకే డోర్ నెంబరు కలిగిన ఓట్లు 24,61,676 ఉన్నట్టు గుర్తించామని వెల్లడించింది.


More Telugu News