సంక్రాంతి బరిలో మెగా మూవీ లేనట్టే!

  • కల్యాణ్ కృష్ణతో సెట్స్ పైకి వెళ్లనున్న చిరూ 
  • కథపై పూర్తికాని కసరత్తు 
  • కొనసాగుతున్న తర్జనభర్జనలు 
  • వచ్చే వేసవికి రిలీజ్ చేసే ఛాన్స్
చిరంజీవి ఒక వైపున కల్యాణ్ కృష్ణకీ .. మరో వైపున శ్రీవశిష్ఠకి ఛాన్స్ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. శ్రీవశిష్ఠతో మెగాస్టార్ చేసే సినిమా ఫాంటసీ జోనర్లో నడుస్తుంది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అందువలన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడనికి ఎక్కువ సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణతో చేయనున్న ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని చిరంజీవి అనుకున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకుని ఈ సినిమాను 'సంక్రాంతి' బరిలో నిలపాలని భావించారు. ఆ దిశగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడా. కానీ పూర్తి కథ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు .. తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. 

ఇక చిరంజీవి ఇటీవలే మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ కారణంగా కూడా ఈ సినిమా ఆశించిన స్పీడ్ లో ముందుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. అందువలన సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లకు వచ్చే ఛాన్స్ లేదనీ, వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.



More Telugu News