ఆసియా కప్ లో నేడు కీలకపోరు... శ్రీలంకపై టాస్ గెలిచిన భారత్
- ఇవాళ కొలంబోలో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- నిన్న ఇదే మైదానంలో పాకిస్థాన్ ను ఓడించిన రోహిత్ సేన
ఆసియా కప్ లో నిన్న పాకిస్థాన్ తో మ్యాచ్ నెగ్గిన భారత్... మరుసటిరోజే మరో కీలక పోరుకు సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం భారత్, శ్రీలంక జట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది.
ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఆసియా కప్ లో భారత్ ఫైనల్ చేరే అవకాశాలు మరింత మెరుగవుతాయి. కాగా, నేటి మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతినిచ్చి అక్షర్ పటేల్ కు తుదిజట్టులో స్థానం కల్పించారు. కొద్దిసేపటి క్రితమే మ్యాచ్ ప్రారంభం కాగా... 3 ఓవర్ల అనంతరం భారత్ వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 9, శుభ్ మాన్ గిల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.