పాట రాయడానికి ముందు నాన్న ఏం చేసేవారంటే..!: సిరివెన్నెల తనయుడు రాజా

  • నటుడిగా రాణిస్తున్న సిరివెన్నెల తనయుడు 
  • తండ్రితో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావన 
  • ఎలా ఉంటే అలా పాట రాసేవారు కాదని వెల్లడి 
  • వృత్తి పట్ల ఆయనకి అంకితభావం ఎక్కువని వ్యాఖ్య 
తొలి పాటనే తన పాండిత్యానికి కొలమానంగా నిలిపిన గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన ప్రతి పాటా అనుభవసారం .. అనుభూతి తీరం. ఆయన తనయుడు రాజా నటుడిగా బిజీ. సినిమాలలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ముందుకు వెళుతున్నాడు. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన తండ్రిని గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.

"మా నాన్నగారు ముందుగా పాట సందర్భాన్ని .. పాత్రల స్వభావాన్ని అర్థం చేసుకుంటారు. పాట మొత్తానికి కలిసి ఒక 'హుక్' పాయింట్ ఉంటుంది .. అది దొరగ్గానే ఆయన పాట రాయడం మొదలుపెడతారు. నాన్న హిల్ స్టేషన్స్ కి వెళ్లి పాటలు రాసిన సందర్భాలు లేవు .. తన గదిలోనే ఆయన పాటలు రాసేవారు" అని అన్నాడు. 

"ఏదో ఒక పని చేస్తూ .. పాట గుర్తుకురాగానే వెంటనే వెళ్లి రాసేయడం నాన్నకి అలవాటు లేదు. పాట రాయాలని ఆయన అనుకున్నప్పుడు ముందుగా స్నానం చేసి .. కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ తరువాత బొట్టు పెట్టుకుని పూజ చేసుకుంటారు. పూజ పూర్తయిన తరువాతనే రాయడం మొదలుపెట్టేవారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇదే చూస్తూ వచ్చాను" అని చెప్పుకొచ్చాడు. 



More Telugu News