ఎన్ని కేసులు పెట్టినా సరే ఎవడికీ భయపడేది లేదన్న బాలకృష్ణ.. వీడియో ఇదిగో!
- ప్రజల పక్షాన చేస్తున్న పోరాటం ఆపబోమని స్పష్టం చేసిన టీడీపీ ఎమ్మెల్యే
- చంద్రబాబు అరెస్టుపై ప్రెస్ మీట్
- చంద్రబాబును జైలులో పెట్టాలని ‘స్కాం’ ప్లాన్ చేశారన్న బాలకృష్ణ
- ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు పన్నులతో చావగొడుతున్నారని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపాలనే కుట్రతో లేని స్కాంను సృష్టించారని హిందూపూర్ ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టుపై ఆయన మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా సరే న్యాయ పోరాటం చేస్తాం తప్ప ఎవడికీ భయపడేది లేదని ఈ సందర్భంగా బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలకోసం టీడీపీ తరఫున చేస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని తేల్చి చెప్పారు. ఇలాంటి కుట్రలు టీడీపీకి, చంద్రబాబుకు కొత్తేం కాదని అన్నారు.
‘నేను 16 నెలలు జైలులో ఉన్నాను, చంద్రబాబును 16 రోజులన్నా జైలుకు పంపాలని ప్లాన్ చేశారు.. కుట్రలో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో కుంభకోణం జరిగిందంటున్నారు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరును మొదట్లోనే ఎందుకు చేర్చలేదు? కేసులో చార్జిషీట్ ఎందుకు వేయలేదు? అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్.. ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి చెప్పుకునే మాట ఇది’ అని బాలకృష్ణ చెప్పారు.
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి పన్నులతో ప్రజలను చావగొడుతున్నారని జగన్ సర్కారుపై బాలకృష్ణ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి జగన్ తన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించడంపైనే దృష్టి పెట్టాడని ఆరోపించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేనితనంతో, వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదని తేలిపోవడంతోనే జగన్ ఈ కుట్రలు చేస్తున్నాడని బాలకృష్ణ మండిపడ్డారు.