పవన్ కల్యాణ్ స్పీచ్‌ షేర్​ చేయగానే తనను టార్గెట్ చేశారంటున్న యాంకర్ రష్మి

  • సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడిన జనసేన అధినేత
  • దీన్ని షేర్ చేసినందుకు తనను విమర్శిస్తున్నారని రష్మి ఆవేదన
  • తాను నమ్మే దేవుడిని.. తన విశ్వాసాన్ని తిట్టొద్దని హెచ్చరిక
సనాతన ధర్మానికి మద్దతుగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రసంగం వీడియోను సోషల్ మీడియాలో షేర్‌‌ చేసినందుకు తనను కొందరు ట్రోల్‌ చేస్తున్నారని యాంకర్ రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేసింది. నాస్తికులను తాను గౌరవిస్తున్నప్పుడు, తాను సనాతన ధర్మాన్ని నమ్ముతున్నానని చెబితే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించింది. తనకు ఎదురైన విషయాలను ఎక్స్ (ట్విట్టర్)లో రాసుకొచ్చింది.

‘నేను ఈ ఒక్క పోస్ట్‌ను షేర్ చేయగానే నన్ను అంతా టార్గెట్ చేసుకున్నారు. తమకు వాక్ స్వాతంత్ర్యం ఉందంటూ చాలా మంది దీనిపై వాదిస్తున్నారు. కానీ, నేను నమ్ముతున్న ధర్మం వైపు ఉంటానని చెప్పినందుకు నేను విమర్శలు ఎదుర్కోవాలా? సిగ్గుపడలా? నేను మీ నాస్తికత్వాన్ని ప్రశ్నించడం లేదు. అలాంటప్పుడు నా విశ్వాసాలను మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కొందరు కులాల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అసలు ఏ మతం సరైనదో చెప్పండి. తీవ్రవాదులు, అతివాదులు లేని మతం ఏదో చెప్పండి? కేవలం మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని కుటుంబాన్ని మార్చుకోలేరు కదా? అన్ని మతాలకు మూల సూత్రం ఒకటే ఉంది. అదే బ్రతకండి.. బ్రతకనివ్వండి. అంతే తప్ప నా దేవుడిని, నా విశ్వాసాన్ని తిట్టొద్దు’ అని ట్వీట్ చేసింది.


More Telugu News