కోహ్లీ ఎవరూ ఊహించనన్ని సెంచరీలు చేస్తాడు.. పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్

  • కేఎల్ రాహుల్‌పైనా ప్రశంసలు
  • అతడి ఫీల్డింగ్ చూసి ముచ్చటేసిందన్న వకార్
  • కోహ్లీ తన కెరియర్ ముగించే నాటికి ఎవరూ అందుకోలేనన్ని శతకాలు బాదుతాడన్న మాజీ కెప్టెన్
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసియాకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ 94 బంతుల్లోనే అజేయంగా 122 పరుగులు చేసి తన ఖాతాలో 47వ వన్డే సెంచరీని వేసుకున్నాడు. సచిన్ వన్డే సెంచరీల రికార్డుకు కోహ్లీ ఇంకా రెండు శతకాల దూరంలో నిలిచాడు. అంతేకాదు, అత్యంత వేగంగా 13 వేల పరుగులు సాధించిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.   

కోహ్లీ సాధించిన ఈ ఘతనపై వకార్ మాట్లాడుతూ కోహ్లీకి.. సచిన్ సహా ఇతర ఆటగాళ్లకు ఉన్న వ్యత్యాసం అదేనన్నాడు. కోహ్లీ తన కెరియర్ ముగించేనాటికి ఎవరూ ఊహించనన్ని శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. మరో ఆటగాడు కేఎల్ రాహుల్‌పైనా వకార్ స్పందించాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ను చూసి కోహ్లీతో సమానంగా పరిగెట్టగలడా? అని జాలిపడ్డానని, కానీ అద్భుతంగా ఆడాడని కితాబునిచ్చాడు. ఒక్క పరుగును కూడా మిస్ చేయలేదని అన్నాడు. బ్యాటింగ్, రన్నింగ్, ఫీల్డింగ్‌లో అత్యుత్తమంగా ఉండాలనుకున్నాడని పేర్కొన్నాడు. అతడి ఫిట్‌నెస్ చూస్తుంటే ముచ్చటేస్తుందని ప్రశంసించాడు.


More Telugu News