విషమంగా డి.శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి
- నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన డి.శ్రీనివాస్
- హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
- అనారోగ్యం వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్న శ్రీనివాస్
తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. దీంతోపాటు శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఒక ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని చెప్పారు. అనారోగ్య కారణాల నేపథ్యంలో కొంత కాలంగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు.
డి.శ్రీనివాస్ ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వంతో ఆయనకు విభేదాలు ఉన్నప్పటికీ, అదే పార్టీలో కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయన చిన్న కుమారుడు అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు.