పుట్టిన రోజున సాలీడు తెచ్చిన లక్.. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం
- పుట్టిన రోజున సాలీడును చూసిన 70 ఏళ్ల బ్రిటన్ మహిళ
- ఆ సాలీడు కనిపిస్తే ధనలాభం కలుగుతుందని అక్కడి వారి నమ్మకం
- ఆ తరువాత మహిళకు దక్కిన బంపర్ లాటరీ
- నెలకు 10 వేల పౌండ్ల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం
పుట్టిన రోజున లాటరీ టిక్కెట్టు కొన్న ఓ బ్రిటన్ మహిళకు బంపర్ లాటరీ దక్కింది. నెలకు రూ.10 లక్షల చొప్పున 30 ఏళ్ల పాటు ఆదాయం వచ్చేలా ఆమె లాటరీ గెలుచుకుంది.
ఇంగ్లండ్‌లోని డోర్కింగ్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ డోరిస్ స్టాన్‌బ్రిడ్జ్ ఇటీవలే తన పుట్టిన రోజు జరుపుకుంది. ఈ క్రమంలో ఆమెకు తన ఇంటి ఎదురుగా పచ్చికపై మనీ స్పైడర్ అనే సాలీడు కనిపించింది. అది కనిపిస్తే ఆర్థికంగా లాభం చేకూరుతుందని అక్కడి వారి నమ్మకం. దీంతో, ఆమె ఆ రోజున లాటరీ టిక్కెట్టు కొనుగోలు చేసింది.
ఆ తరువాత కొన్ని రోజులకు లాటరీ సంస్థ వారు డోరిస్‌ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించారు. ఆమె టిక్కెట్టు నెంబర్‌పై బంపర్ లాటరీ తగిలిందని, 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షల( మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) చొప్పున ఆమెకు ఆదాయం వస్తుందని చెప్పారు. దీంతో, డోరిస్ సంబరానికి అంతేలేకుండా పోయింది. ఇప్పుడు తనకు వందేళ్ల దాకా బతకాలనే స్ఫూర్తి కలిగినట్టు ఆమె స్థానిక మీడియాతో చెప్పింది.
తన బంధువులందరినీ తీసుకుని విదేశీ టూర్ ప్లాన్ చేస్తున్నానని, గ్రామీణ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యం తొణికిసలాడే చోట ఓ భారీ బంగళా కొనే యోచనలో ఉన్నానని కూడా ఆమె చెప్పుకొచ్చింది.