జీ20 సదస్సు: ఢిల్లీ డిక్లరేషన్ సానుకూల సంకేతాన్ని ఇచ్చిందన్న చైనా

  • జీ20 సందర్భంగా ఢిల్లీ డిక్లరేషన్‌పై చైనా హర్షం
  • సవాళ్లను ఎదుర్కోవడంలో చేతులు కలుపుతున్నాయనే సంకేతం ఇస్తోందని వ్యాఖ్య
  • డిక్లరేషన్ సిద్ధం చేసే ప్రక్రియలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించిందన్న డ్రాగన్ ప్రభుత్వం
జీ20 సదస్సుపై చైనా ప్రశంసలు కురిపించింది. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చైనా కూడా... జీ20  సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాల ఏకాభిప్రాయం భారీ విజయంగా చెబుతోంది. ఇది సానుకూల ధోరణి అని పేర్కొంది. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో జీ20 దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాలను ఢిల్లీ డిక్లరేషన్ ఇస్తోందని తెలిపింది.

చైనా ప్రతిపాదన మంచి సంకేతమని జీ20 సదస్సు డిక్లరేషన్ ద్వారా వెల్లడైందని, ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సవాళ్లపై దేశాలు చేతులు కలుపుతున్నాయనే సంకేతాన్ని ఈ డిక్లరేషన్ ఇచ్చిందని, ఆర్థిక పునరుద్ధరణ విషయంలో ప్రపంచానికి ఇది సానుకూల సంకేతాన్ని పంపిస్తోందని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. డిక్లరేషన్ సిద్ధం చేసే ప్రక్రియలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించిందన్నారు. అభివృద్ధి చెందుతోన్న దేశాల ఆందోళనకు ప్రాముఖ్యత లభించినట్లు చెప్పారు.


More Telugu News