కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్ కౌశల్

కడప జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్ కౌశల్
  • అన్బురాజన్ స్థానంలో కడప జిల్లాకు కొత్త ఎస్పీ
  • అక్టోపస్ నుంచి బదిలీపై వచ్చిన సిద్ధార్థ్ కౌశల్
  • అన్బురాజన్ ను అనంతపురం జిల్లాకు బదిలీ చేసిన ప్రభుత్వం 
కడప జిల్లా నూతన ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన సిద్ధార్థ్ కౌశల్ ఎస్పీగా విధి నిర్వహణ షురూ చేశారు. ఆయనకు కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ కౌశల్ మాట్లాడుతూ, శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలపై దృష్టిసారిస్తామని తెలిపారు. 

సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో ప్రకాశం, కృష్ణా, కర్నూలు జిల్లాలకు ఎస్పీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆక్టోపస్ విభాగం నుంచి కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. శాంతిభద్రతల విషయంలోనూ, నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని సిద్ధార్థ్ కౌశల్ కు పేరుంది. 

ఇప్పటివరకు కడప జిల్లాకు అన్బురాజన్ ఎస్పీగా వ్యవహరించగా, ఆయన స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ వచ్చారు. అన్బురాజన్ ను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు.


More Telugu News