ఆగిన వర్షం... మొదలైన భారత్, పాక్ పోరు

  • ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాక్ ఢీ
  • నిన్న కొలంబోలో వర్షంతో నిలిచిన దాయాదుల పోరు
  • నేడు రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగింపు
  • దూకుడుగా ఆడుతున్న భారత్
ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నేడు రిజర్వ్ డేలో మొదలైంది. నిన్న వర్షంతో నిలిచిన మ్యాచ్ ను ఇవాళ కొనసాగించారు. ఈ మధ్యాహ్నం కూడా శ్రీలంక రాజధాని కొలంబోలో వర్షం పడడంతో మ్యాచ్ జరుగుతుందా, లేదా అనే సందేహాలు ముసురుకున్నాయి. అయితే, వర్షం తగ్గడంతో మైదాన సిబ్బంది కొద్ది వ్యవధిలోనే మ్యాచ్ కు అనువుగా అవుట్  ఫీల్డ్ ను సిద్ధం చేశారు. ఎట్టకేలకు కాస్త ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది.

నిన్న మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఇవాళ కూడా భారత్ దూకుడుకే ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం భారత్ స్కోరు 31 ఓవర్లలో 2 వికెట్లకు 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 42, కోహ్లీ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News