స్కిల్ స్కాం నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు 9 ప్రశ్నలు సంధించిన వర్మ

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రిమాండ్ విధించిన కోర్టు
  • ఈ స్కాం గురించి పోస్టులు పెడుతున్న వర్మ
  • తాజాగా పవన్ ను ఉద్దేశించి 'ఎక్స్' లో పోస్టు
ఏపీలో ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, చంద్రబాబు గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా 'ఎక్స్' లో ఈ స్కాం గురించి పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు. స్కిల్ స్కాంకు సంబంధంచి పవన్ 9 ప్రశ్నలు సంధించారు. అయితే ఒక్క పదంతో జవాబు ఇవ్వాలని కోరారు. స్కిల్  స్కాం జరిగిందా లేదా? అనే ప్రశ్నతో మొదలుపెట్టి, అసలు స్కిల్ స్కాంలో మీకేం అర్థమయింది? అంటూ తన పోస్టును ముగించారు. 

వర్మ అడిగిన ప్రశ్నలు ఇవే...

1. అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా?
2. కవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?
3. 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా? లేదా?
4. ఒక వేళ  హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ యాక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?
5. FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?
6. చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?
7. సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు అవినీతిపరుడా?
8. లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్ గ్రౌండ్ బట్టి కాదు, వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా?
9. నా తొమ్మిదవ చివరి ప్రశ్న, అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో, దానిలోని తప్పులేంటో ఒక వీడియోలో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?


More Telugu News