ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు
- ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు విచారణ
- నిన్న చంద్రబాబుకు రిమాండ్ విధించిన కోర్టు
- నిన్నటి విచారణలో తమకు అసౌకర్యం కలిగించారన్న టీడీపీ లీగల్ సెల్ సభ్యులు
- పోలీసులు తమను బయటికి పంపించివేశారని ఫిర్యాదు
చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోంది. నిన్న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి టీడీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది.
నిన్న చంద్రబాబు కేసు విచారణలో తమకు అసౌకర్యం కలిగించారని ఆరోపించింది. హౌస్ లో ఉన్న తమను పోలీసులు బయటికి పంపించారని టీడీపీ లీగల్ సెల్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కోర్టు లోపల ఏం పని? అంటూ వారు ప్రశ్నించారు.
నిన్న చంద్రబాబు కేసు తీర్పు కాపీ చదివే సమయంలో కోర్టు హాల్లో 30 మందికి మించి ఉండరాదని న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. మిగిలినవాళ్లు బయటికి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.