‘స్కిల్’ కేసు గోరంతే.. బయటపడాల్సింది కొండంత: ఆదిమూలపు సురేశ్

  • అమరావతి, టిడ్కో ఇళ్ల నిర్మాణంలో స్కామ్ లపై విచారణ
  • అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిక
  • జగన్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజాగా స్పందించారు. ఇప్పుడు చూస్తున్నది గోరంతేనని ఇంకా బయటపడాల్సింది కొండంత ఉందని చెప్పారు. ఈమేరకు సోమవారం ఉదయం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కాం కేసు చిన్నదేనని చెప్పారు. అమరావతి, టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి త్వరలో బయటకు వస్తుందని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాంలలో చంద్రబాబు ఉన్నా.. ఆయన కొడుకు ఉన్నా.. ఇంకెవరు ఉన్నా సరే శిక్ష అనుభవించక తప్పదన్నారు. జగన్ సర్కారు రాష్ట్ర ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని, అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు రాజకీయ కోణం ఏమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.


More Telugu News