ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా కలబురిగిలో నిరసనలు
- నల్ల చొక్కాలు, నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు
- పట్టణంలోకి ప్రవేశించకుండా నిషేధించాలని డిమాండ్
- జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
కర్ణాటకలోని కలబురిగిలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ప్రకాశ్ రాజ్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో.. పలు హిందూ సంస్థలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. నిరసనకారులు నల్లటి వస్త్రాలతో ప్రకాశ్ రాజ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలను ప్రదర్శించారు. కాగా, పోలీసులు నిరసనకారులను కట్టడి చేశారు.
అంతకుముందు హిందూ సంస్థ ప్రతినిధులు కలబురిగి జిల్లా కలెక్టర్ ను కలసి వినతి పత్రాన్ని సమర్పించారు. నటుడికి వ్యతిరేకంగా తాము నిరసనలకు దిగడానికి గల కారణాలను వివరించారు. పట్టణంలోకి ప్రకాశ్ రాజ్ ప్రవేశించకుండా నిషేధం విధించాలని కోరారు. ఇక ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆయన పర్యటించిన ప్రాంతాలను హిందూ అనుకూల వాదులు గోమూత్రంతో శుభ్రం చేశారు.
ప్రకాశ్ రాజ్ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. చివరికి చంద్రయాన్-3 ప్రయోగంపైనా ఆయన వ్యంగ్య పోస్ట్ లు పెట్టి జనాగ్రహానికి గురయ్యారు. ‘బ్రేకింగ్ న్యూస్: చంద్రుడిపై నుంచి వచ్చిన మొదటి ఫొటో’అంటూ టీ అమ్మే వ్యక్తి కార్టూన్ ను ప్రకాశ్ రాజ్ షేర్ చేయడం గమనార్హం.