48 గంటల పాటు నిద్ర లేదు.. అయినా నిబ్బరంగా చంద్రబాబు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అరెస్ట్ నేపథ్యంలో బాబుకు 48 గంటల పాటు నిద్ర కరవు
- 73 ఏళ్ల వయసులో 320 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణం
- అయినా చలించని బాబు, దారిపొడవునా కార్యకర్తలకు ధైర్యం చెప్పిన వైనం
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టు, కోర్టుకు తరలింపు, అనంతరం రోడ్డు మార్గంలో 320 కిలోమీటర్లు ప్రయాణించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకోవడం.. తదితర పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏకంగా 48 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. 73 ఏళ్ల వయసులోనూ.. అంతటి ఒత్తిడి కూడుకున్న వాతావరణంలో చంద్రబాబు స్థిరచిత్తం ప్రదర్శించారు. తన బాధ్యతగా అధికారులకు సహకరించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు అరెస్టయిన సందర్భాలు గతంలో ఉన్నా పోలీసులు ఆయనను వెంటనే విడిచిపెట్టేవారు.
శుక్రవారం నంద్యాలలో అర్ధరాత్రి దాటాక పోలీసులు చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. అనంతర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు దాదాపు ఆ రాత్రంతా నిద్ర కరవైంది. శనివారం ఉదయం 6.15 గంటలకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 320 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో ఆయనను తీసుకొచ్చారు. శనివారం రాత్రంతా విచారణ కోసం చంద్రబాబు తాడేపల్లి సిట్ కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. అనంతరం, తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో, పూర్తిగా రెండు రాత్రుల పాటు చంద్రబాబు కంటి మీద కునుకే లేకుండా పోయింది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు 45 నిమిషాల పాటు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు, ఇతర సిబ్బంది చంద్రబాబుతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టయ్యానన్న ఆందోళన కనిపించకుండా వారితో ఫొటోలు దిగారు. కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినా, ఫర్వాలేదని, తాను బాగానే ఉన్నానని బాబు బదులిచ్చారు.
ఇక న్యాయస్థానంలో విచారణ సందర్భంగానూ చంద్రబాబు కోర్టు హాలులోనే గడిపారు. మీరు విశ్రాంతి తీసుకుంటారా? అని జడ్జి అడిగినప్పుడు అక్కడే ఉంటానని చంద్రబాబు బదులిచ్చారు. అంతకుమునుపు చంద్రబాబు కోర్టులో తన వాదనలు వినిపించారు. ఇక తీర్పు వాయిదా వేసిన సమయంలోనూ అక్కడే ఉన్నారు.