చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాల్సినవి ఇంకా ఆరేడు కేసులు ఉన్నాయి: విజయసాయిరెడ్డి

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రిమాండ్
  • నిన్న అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు
  • నేడు కోర్టులో హాజరు
  • చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విజయసాయిరెడ్డి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. దేశంలో ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని మరోసారి స్పష్టమైందని తెలిపారు. 

అన్యాయాలు చేసినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా స్టేలు తెచ్చుకుని చట్టం నుంచి బయటపడొచ్చని చంద్రబాబు భావించేవాడని... కుట్రలు, కుతంత్రాలతో బయటపడడం చంద్రబాబు విధానం అని విమర్శించారు. 

చంద్రబాబుపై స్కిల్ డెవలప్ మెంట్ స్కాం వ్యవహారంలో గట్టి ఆధారాలతో కేసు పెట్టారని, చంద్రబాబు విదేశాలకు సొమ్ము ఎలా తరలించారో నిగ్గు తేలుతుందని స్పష్టం చేశారు. ఇదే కాకుండా, చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాల్సిన కేసులు ఇంకా ఆరేడు ఉన్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు పాల్పడిన అవినీతిపై పూర్తి విచారణ జరిగితే జీవితకాలం బయటికి రాడని తెలిపారు.


More Telugu News