వన్డే ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి ఆసీస్... రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్

  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఆసీస్
  • ఆసీస్ ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లు
  • పాకిస్థాన్ ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు
  • 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజా ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టు వన్డే టీమ్ ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఆసీస్... పాకిస్థాన్ ను కిందికినెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ ను 3-0తో చిత్తు చేసిన పాక్... ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ కు చేరింది. అయితే ఆ అగ్రస్థానం కొన్నిరోజులే నిలిచింది. ప్రస్తుతం ఆసీస్ ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లు ఉండగా, పాకిస్థాన్ ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 

ఇక, ఈ ర్యాంకింగ్ జాబితాలో టీమిండియా (114) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్ (106), ఇంగ్లండ్ (99), దక్షిణాఫ్రికా (97), బంగ్లాదేశ్ (92), శ్రీలంక (92), ఆఫ్ఘనిస్థాన్ (80), వెస్టిండీస్ (68) జట్లు టాప్-10లో నిలిచాయి.


More Telugu News