నేనున్నానంటూ వచ్చేసిన వరుణుడు... నిలిచిపోయిన భారత్-పాక్ మ్యాచ్

  • ఆసియా కప్ లో నేడు భారత్ తో పాకిస్థాన్ అమీతుమీ
  • 25వ ఓవర్లో వరుణుడు ప్రత్యక్షం
  • అప్పటికి భారత్ స్కోరు 2 వికెట్లకు 147 పరుగులు
  • ఓ మోస్తరు వర్షం కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేసిన సిబ్బంది
ఆసియా కప్ లో భారత్ ఆడే మ్యాచ్ లను వరుణుడు వెంటాడుతున్నాడు. కొన్నిరోజుల కిందట భారత్, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. ఇప్పుడు సూపర్-4 దశలోనూ ఈ రెండు జట్లు తలపడగా, వర్షం మరోసారి ప్రత్యక్షమైంది. టీమిండియా 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసిన దశలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఓ మోస్తరు వర్షం పడడంతో మైదానాన్ని కవర్లతో కప్పివేశారు.  

వర్షంతో అంతరాయం కలిగే సమయానికి కేఎల్ రాహుల్ 17, విరాట్ కోహ్లీ 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు, కెప్టెన్ రోహిత్ శర్మ 56, శుభ్ మాన్ గిల్ 58 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 1, షహీన్ అఫ్రిది 1 వికెట్ తీశారు.


More Telugu News