శుభారంభం అందించిన టీమిండియా ఓపెనర్లు... వెంటవెంటనే అవుట్
- ఆసియా కప్ లో నేడు భారత్, పాకిస్థాన్ ఢీ
- టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పగించిన పాక్
- తొలి వికెట్ కు 121 పరుగులు జోడించిన రోహిత్ శర్మ, గిల్
- రెండు పరుగుల తేడాతో ఇద్దరూ అవుట్
ఆసియా కప్ లో నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ ధాటిగా ఆడి తొలి వికెట్ కు 121 పరుగులు జోడించారు.
అయితే వీరిద్దరూ రెండు పరుగుల తేడాతో వెనుదిరిగారు. రోహిత్ శర్మ 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 56 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. శుభ్ మాన్ గిల్ 52 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి షహీన్ అఫ్రిదికి వికెట్ అప్పగించాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 135 పరుగులు. విరాట్ కోహ్లీ 5, కేఎల్ రాహుల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.