చంద్రబాబు కేసు.. మళ్లీ ప్రారంభమైన విచారణ
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
- భోజన విరామం అనంతరం ప్రారంభమైన వాదనలు
- జడ్జి ఎలాంటి తీర్పును వెలువరిస్తారో అని సర్వత్ర ఉత్కంఠ
స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి వాదనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం గంట పాటు విచారణకు జడ్జి భోజన విరామం ప్రకటించారు. కాసేపటి క్రితం వాదనలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తుండగా... సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బృందం వాదనలు వినిపిస్తోంది.
మరోవైపు, ఈ కేసులో జడ్జి ఎలాంటి తీర్పును వెలువరిస్తారో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. సీఐడీ కోరిన రిమాండ్ ను కోర్టు నిరాకరిస్తుందా? లేక చంద్రబాబుకు రిమాండ్ విధిస్తుందా? అనే టెన్షన్ కొనసాగుతోంది.
మరోవైపు, ఈ కేసులో జడ్జి ఎలాంటి తీర్పును వెలువరిస్తారో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. సీఐడీ కోరిన రిమాండ్ ను కోర్టు నిరాకరిస్తుందా? లేక చంద్రబాబుకు రిమాండ్ విధిస్తుందా? అనే టెన్షన్ కొనసాగుతోంది.