భారత్ లో ముగిసిన బైడెన్ టూర్

  • వియత్నాం బయలుదేరి వెళ్లిన అమెరికా ప్రెసిడెంట్
  • రాజ్ ఘాట్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ చేరుకున్న బైడెన్
  • ఎయిర్ ఫోర్స్ వన్ లో వియత్నాంకు పయనం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత పర్యటన ముగించుకున్నారు. జీ20 సదస్సు కోసం శుక్రవారం ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ తొలిసారి మన దేశానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పలు కీలక విషయాలపై చర్చించారు. శనివారం జీ20 సదస్సులో పాల్గొని వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం మిగతా దేశాధినేతలతో కలిసి రాజ్ ఘాట్ ను సందర్శించారు. 

మహాత్ముడికి నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ లో వియత్నాం బయలుదేరి వెళ్లారు. వియత్నాంలో కూడా బైడెన్ రెండు రోజుల పాటు పర్యటిస్తారని అమెరికా అధికారులు తెలిపారు. ఆది, సోమ వారాలు బైడెన్ వియత్నాంలోనే ఉంటారని, మంగళవారం తిరిగి అమెరికా బయలుదేరుతారని చెప్పారు. కాగా, వియత్నాం పర్యటనలోనూ బైడెన్ ద్వైపాక్షిక సంబంధాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని సమాచారం.







More Telugu News