చంద్రబాబు రిమాండ్ కేసు విచారణకు విరామం

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి కొనసాగుతున్న వాదనలు
  • విచారణకు భోజన విరామం ప్రకటించిన కోర్టు
  • మధ్నాహ్నం తిరిగి 1.30 గంటలకు తిరిగి ప్రారంభ కానున్న విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్ కు సంబంధించిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఉదయం నుంచి వాదనలు జరగుతున్న సంగతి తెలిసిందే. కేసు విచారణకు జడ్జి భోజన విరామం ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 1.30 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని, సీఐడీ అధికారులు గవర్నర్ అనుమతి తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. 

కేవలం రాజకీయ కక్షలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ పోలీస్ అధికారుల కాల్ డేటా తనకు కావాలని కోర్టును కోరారు. ఎన్నికలకు ముందు రాజకీయ ప్రేరేపితంగా కేసు పెట్టారని ఆరోపించారు. మరోవైపు 2021లో కేసు నమోదైతే చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో ఎందుకు చేర్చలేదని సీఐడీని కోర్టు ప్రశ్నించింది.



More Telugu News