అమెజాన్ ప్రైమ్ కి మరో క్రైమ్ థ్రిల్లర్ .. 'బంబై మేరీ జాన్'
- అమెజాన్ ప్రైమ్ కి 'బంబై మేరీ జాన్'
- 1960ల నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్
- బొంబై పోలీసులకు .. గ్యాంగ్ స్టర్స్ కి జరిగే పోరాటం ఇది
- ఈ నెల 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలు
ఓటీటీ సెంటర్స్ లో ఎక్కువగా కనిపించే కంటెంట్ ఏదైనా ఉందంటే, అది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ అని బలంగా చెప్పుకోవచ్చు. ఈ తరహా వెబ్ సిరీస్ లకు మంచి స్పందన వస్తుండటంతో, మేకర్స్ దృష్టి కూడా ఈ కాన్సెప్ట్ ల పైనే ఉంటోంది. అలా రూపొందిన మరో వెబ్ సిరీస్ గా 'బంబై మేరీ జాన్' కనిపిస్తోంది.
ఇది 1960ల నేపథ్యంలో నడిచే కథ .. ఈ నెల 14వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. 1960లలో బొంబై పోలీసులకు .. గ్యాంగ్ స్టర్స్ కి మధ్య జరిగే పోరాటం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ కాలానికి చెందిన వాతావరణం .. జీవనశైలి .. అందుకు తగిన కాస్ట్యూమ్స్ ఈ వెబ్ సిరీస్ కి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ విషయంలో రీసెంట్ గా 'గన్స్ అండ్ గులాబ్స్' మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. షుజాత్ సౌదాగర్ దర్శకత్వం వహించిన 'బంబై మేరీ జాన్' వెబ్ సిరీస్ లో, కేకే మీనన్ .. అవినాశ్ తివారి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో కృతిక కమ్రా .. నివేదిత భట్టాచార్య .. అమైరా దస్తూర్ కనిపించనున్నారు.