అమెరికా అధ్యక్షుడు బైడెన్ జీ20 కాన్వాయ్ డ్రైవర్ నిర్బంధం

  • హోటల్ తాజ్‌లోకి ప్రవేశించిన కారు డ్రైవర్
  • బైడెన్ బస చేసిన హోటల్ మౌర్య అనుకున్నానని వివరణ
  • ప్రశ్నించిన అనంతరం విడిచిపెట్టిన సెక్యూరిటీ సిబ్బంది
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ జీ20 కాన్వాయ్ డ్రైవర్‌ను ఢిల్లీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌కు గాను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ తర్వాత విడిచిపెట్టారు. బైడెన్ కాన్వాయ్‌లోని కారు తాజ్ హోటల్‌లోకి ప్రవేశించింది. అదే హోటల్‌లో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బస చేశారు.

డ్రైవర్‌ను ప్రశ్నించగా తాను బైడెన్ బస చేసిన ఐటీసీ మౌర్యగా పొరబడ్డానని చెప్పాడు. అయితే, లోధి ఎస్టేట్ ప్రాంతంలో పికప్ చేసుకున్న వ్యాపారవేత్తను తాజ్ వద్ద డ్రాప్ చేయాల్సి రావడంతో తాజ్ వద్దకు చేరుకున్నాడు. తనకు ప్రొటోకాల్‌పై అవగాహన లేదని చెప్పుకొచ్చాడు. ప్రశ్నించిన అనంతరం అతడిని విడిచిపెట్టారు. కాన్వాయ్ నుంచి అతడి కారును తప్పించారు.


More Telugu News