రాజన్న సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ప్రతిభ.. వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలు

  • రెండు మీటర్ల పొడువున్న వస్త్రంపై అద్భుతం
  • గతంలోనూ జీ20 లోగోతో వస్త్రం తయారు చేసి మోదీకి పంపిన వైనం
  • హరిప్రసాద్ ప్రతిభను కొనియాడిన మోదీ
  • ఈసారి అవకాశం లభిస్తే నేరుగా మోదీని కలిసి తాజా వస్త్రాన్ని అందిస్తానన్న హరిప్రసాద్
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోమారు అద్భుతం చేశాడు. రెండు మీటర్ల పొడవున్న వస్త్రంపై జీ20 దేశాధినేతల ఫొటోలను చిత్రించాడు. దీంతోపాటు భారత జాతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా రూపొందించాడు. అంతేకాదు, ఈ వస్త్రంపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివాదం చేస్తున్న ఫొటోతోపాటు పక్కనే హిందీలో నమస్తే అన్న అక్షరాలతో ఆ వస్త్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు.

నిరుడు కూడా జీ20 లోగోతో ఓ వస్త్రాన్ని రూపొందించి మోదీకి పంపాడు. అతడి ప్రతిభను గుర్తించిన ప్రధాని తన ‘మన్‌ కీ బాత్’లో హరిప్రసాద్ గొప్పతనాన్ని వివరించారు. చేనేత కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశాలు కల్పిస్తోందని కొనియాడారు. కాగా, హరిప్రసాద్ తాజా వర్క్‌కు వారం రోజులు పట్టింది. తనకు అవకాశం లభిస్తే ప్రధానికి స్వయంగా ఈ వస్త్రాన్ని అందించాలనుకుంటున్నట్టు చెప్పాడు.


More Telugu News